inspiration kavitha

అనంతమైన కడలిలో ఒక నీటి బిందువు కూడా పనికి రాదే ?

   అద్భుతమైన ఇంద్రధనస్సు వల్ల ఉపయోగం లేదే ?

   కనిపించే నింగి నిజం కాదే ?

   ప్రాణాన్ని నిలబెట్టే గాలికి ప్రాణం లేదే ?

   జాబిల్లి రావే అన్న మాటలో జాబిల్లి ఎప్పటికీ రాదే ?

   మహా వృక్షంగా ఎదిగే విత్తనం పెద్దది కాదే?

   మహా పర్వతాన్ని తవ్వగల ఎలుక గొప్పది కాదే?

   జీవాన్ని నిలబెట్టే జలంకు రంగు లేదే?

   నీలో ప్రవహించే రక్తానికి జీవం లేదే?

   సానబెట్టని వజ్రానికి విలువ లేదే?

   మరి……….

   జీవితమనే పోరును ఎదుర్కోలేని నీకెక్కడ గొప్పస్థానం లభిస్తుంది?

   పై వాటిని ఒక్కోటిగా మార్చి చూడు?

   అనంతమైన కడలి అనంతమైన జీవరాశికి ఆధారం అవుతుంది

   అద్భుతమైన ఇంధ్రధనస్సు ప్రకృతికి అందాన్నిస్తుంది

   నిజం కాని నింగి తన ఉన్నతస్థాయిని చాటుతుంది

   ప్రాణంలేని గాలి నీ ఊపిరికి కారణం నేనంటుంది

   జాబిల్లి అన్న మాటలో జాబిల్లి రాకపోయినా జాబిల్లిని చేరుకోవాలనే ఆశ మనలో పుట్టించింది

   విత్తనం పెద్దది కాకపోవచ్చు,వృక్షమై ఆశ్రయాన్ని అందిస్తుంది 

   ఎంత పెద్ద పర్వతాలనైనా పిండిగా కొట్టగలనని ఎలుక సందేశాన్నందిస్తుంది

   జీవితాంతం నీ జీవం నిలబడాలంటే జలం అయిన నన్ను సేవించాలంటుంది

   నాలో జీవం లేకపోయినా నేనే జీవం అంటూ రక్తం ప్రకటిస్తుంది

   సానబెట్టి చూడు నేనే విలువైనదాన్ని అని వజ్రం అంటుంది

   ప్రయత్నించి చూడు, ప్రయత్నిస్తూనే ఉండు అని జీవితం అంటుంది.

   వేలంతలేని చీమ వేలెత్తి చూపుతుంది ఓరి పిచ్చోడా! నాకన్నా పెద్ద శ్రమా నీది అని

   భగ భగ మండే అగ్ని అడుగుతోంది నాకన్నా ఎక్కువగా కాలుతున్నావా అని

   కనిపించనివి ఎన్నో తమ ఉనికిని చాటుతూ నేనే గ్రేట్ అంటున్నాయి

   కనిపించేవి ఎన్నో నేనే నిజం అంటున్నాయి

   వాటన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోగల నీవు ఐ యాం ద గ్రేట్ అనలేవా?

   చూడు…

   నీలో నువ్వే తొంగి చూడు

   నిన్ను మించినోడు ఇంకెవ్వడు లేడు.

   బలహీనుడవై బ్రతుకును తుంచుకుంటావో ,

   బలవంతుడవై భవిష్యత్ ను బ్రతికించుకుంటావో

   నీ నిర్ణయానికే వదిలేస్తున్నా!

  ఇట్లు

                                                                                   మీ మిత్రుడు

                                                                            బి. దుర్గ బాబు.